Jagapathi Babu’s Sensational Remarks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రారంభంలో ఎదురైన సోషల్ మీడియా నెగిటివిటీని తట్టుకుని, ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో నిలబడింది. ఈ నేపథ్యంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతిబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దర్శకుడు బుచ్చిబాబుతో జరిగిన ఒక ప్రత్యేక సంభాషణలో జగపతిబాబు సినిమాపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండించారు.

ప్లాన్డ్ నెగిటివిటీ

పెద్ది సినిమాను పరిశ్రమలో కొందరు కావాలనే తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకోసమే పక్కా ప్లానింగ్‌తో నెగిటివ్ ప్రచారం చేశారని జగపతిబాబు ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని, ప్రతి షాట్‌లోనూ సిక్సర్ కొట్టేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. చరణ్ ఎంతో కష్టపడి పోరాడి గెలిచాడని చెప్తూ.. "ఇండస్ట్రీలో గెలిచిన తర్వాత కూడా ఇంకా పోరాడాల్సి రావడం దురదృష్టకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని, సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని ఆయన ఓపెన్‌గా అంగీకరించారు. అయితే రోజులు గడిచేకొద్దీ పెద్ది చిత్రానికి మౌత్ టాక్ పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తున్నారని, సినిమా ఇంత బాగుంటే అంత నెగిటివ్ ప్రచారం ఎలా చేశారో అర్థం కావడం లేదని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారని జగ్గూ భాయ్ పేర్కొన్నారు.

Tags: