Nayanthara: గజిని సినిమాలో నన్ను అసహ్యంగా చూపించారు : నయనతార
నన్ను అసహ్యంగా చూపించారు;
Nayanthara: తమిళంలో సూర్య హీరోగా నటించిన గజిని సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆసిన్ నటించింది. రెండో హీరోయిన్ గా నయనతార చేసింది. ఈ మూవీలో ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ గా కనిపించింది. అయితే ఈ పాత్రను తాను ఆశించిన విధంగా చూపలేదని, తన లుక్ కూడా అతి తక్కువ స్థాయిలో చూపారని ఆమె పేర్కొంది. ‘ఆ సినిమాలో నన్ను అసహ్యంగా చూపించారు. ఫొటోలు కూడా చెత్తగా తీశారు. అయితే మొదట ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నయనతారకి వేరేలా చెప్పారట. చూపించేటప్పుడు మరోలా చూపించారట. ' తనకు ముందుగా చెప్పినదానికంటే తక్కువ పాత్రలో చూపారని గతాన్ని గుర్తు చేసుకుంది నయన్. ఇది నా కెరియర్ లోనే చెత్త సినిమా.. చెత్త పాత్ర.. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది గజిని సినిమా(Gajini Movie) లో నటించడమే అంటూ నయనతార చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో నయనతార మాట్లాడిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన వీడియో నయన్ లుక్ తో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.