Vadde Naveen: నా మార్కెట్ ఏంటో ఈ సినిమాతో తెలుస్తుంది: వడ్డే నవీన్

వడ్డే నవీన్

Update: 2026-06-18 08:06 GMT


Vadde Naveen: టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్.. కొంత గ్యాప్ తర్వాత మరోసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.కమల్ తేజ నార్ల దర్శకత్వంలో రాశిసింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో వడ్డే నవీన్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ మారిందని, కేవలం లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీస్తే సరిపోవడం లేదన్నారు నవీన్. సరికొత్త కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఇస్తేనే ఆదరిస్తున్నారని, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా కూడా సరిగ్గా అలానే డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పారు.

కథ నెమ్మదిగానే స్టార్ట్ అయినా.. ఒక్కసారి క్యారెక్టర్ల మధ్య సంఘర్షణ మొదలయ్యాక సినిమా చాలా గ్రిప్పింగ్‌గా వెళ్తుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఊహించలేరని నవీన్ ధీమా వ్యక్తం చేశారు. సిస్టమ్‌లో ఉంటూనే పోరాడే ఒక కానిస్టేబుల్ పాత్రలో తను కనిపిస్తానని, ఈ త్రిమూర్తులు క్యారెక్టర్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని తెలిపారు.

ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న వడ్డే నవీన్.. తన మార్కెట్ వాల్యూ ఏంటో తెలుసుకోవడానికే ఈ సినిమాను సొంతంగా నిర్మించినట్లు చెప్పారు. ఇకపై కూడా సోలో హీరోగానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నానని.. అయితే కథ బాగుంటే మల్టీస్టారర్లు, ఓటీటీ ప్రాజెక్ట్‌లు చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

కమల్ మేకింగ్ చాలా కొత్తగా ఉంటుందని.. కథను నమ్మి పక్కా ప్లానింగ్‌తో సినిమా తీశామన్నారు. కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ' ఇప్పటికే సొంతం చేసుకోవడం విశేషం.

Tags:    

Similar News