Manchu Manoj: ఇది సినిమా కాదు..మా అక్క కల : మంచు మనోజ్
మా అక్క కల : మంచు మనోజ్
Manchu Manoj: నటుడు మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మి నటించిన 'దక్ష' సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి, తన సోదరి గురించి మాట్లాడారు.అక్క లక్ష్మి 'దక్ష' సినిమా కోసం చాలా కష్టపడింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఆమె కల. ఈ సినిమాకు ప్రేక్షకులు సపోర్ట్ చేసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను.మా నాన్నగారు (మోహన్ బాబు) అక్క కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. అన్ని సినిమాలు బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుంది. మనోజ్ తన సోదరి మంచు లక్ష్మిపై ఉన్న అభిమానాన్ని, ఆమె సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు.
ఇటీవల మంచు మనోజ్ మిరాయ్ సినిమాలో ప్రధాన విలన్‌గా మహాబీర్' అనే పాత్రలో నటించారు. మనోజ్ తన కెరీర్‌లో మొదటిసారిగా పూర్తి స్థాయిలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చాలా మంది విశ్లేషకులు, అభిమానులు ఆయన నటనకు ప్రశంసలు కురిపించారు. చాలా కాలం తర్వాత మనోజ్ ఈ సినిమా ద్వారా తిరిగి తెరపై కనిపించారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ పాత్రతో మనోజ్ నటుడిగా తనలో ఉన్న కొత్త కోణాన్ని చూపించారు.