Suriya’s Generosity: సూర్య రేంజ్ అంటే ఇది.. కెమెరామెన్‌కు రూ. 40 లక్షల లగ్జరీ కార్ గిఫ్ట్
కెమెరామెన్‌కు రూ. 40 లక్షల లగ్జరీ కార్ గిఫ్ట్
Suriya’s Generosity: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య... చాన్నాళ్ల తర్వాత అలాంటి ఒక సాలిడ్ సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో... సూర్య ఆనందానికి అసలు అవధుల్లేవు!
తెలుగులో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఆశించిన స్థాయిలో టాక్ రాకపోయినప్పటికీ, కలెక్షన్స్ పర్లేదనిపిస్తున్నాయి. కానీ, తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు.లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య ఖాతాలో పడిన ఈ క్రేజీ హిట్... ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తోంది! ఇది సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సినిమాకు ఊహించని రేంజ్‌లో వసూళ్లు వస్తుండటంతో... సూర్య తన చిత్ర యూనిట్‌కు ఖరీదైన బహుమతులు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన క్రేజీ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకు... దాదాపు రూ. 30 నుంచి 40 లక్షల విలువైన మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి షాక్ ఇచ్చాడు సూర్య!
గతంలో ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి ఇండస్ట్రీ హిట్లకు కెమెరామెన్‌గా పనిచేసిన జీకే విష్ణు... ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. "ఇదంతా దేవుడి దయ... థాంక్యూ సూర్య సార్. మీకు చాలా పెద్ద మనసు ఉంది" అంటూ కారు ఫోటోను పోస్ట్ చేశాడు.
సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్లను సూర్య గౌరవిస్తున్న తీరుపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే, కేవలం సినిమాటోగ్రాఫర్‌కే ఇంత లగ్జరీ కారు ఇస్తే... మరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్‌జే బాలాజీకి సూర్య ఎలాంటి క్రేజీ కార్ గిఫ్ట్‌గా ఇస్తాడో చూడాలని నెటిజన్లు ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.