Kamal Haasan:థగ్ లైఫ్ కలెక్షన్లు..కమల్ కు కష్టమే..
కమల్ కు కష్టమే..;
Kamal Haasan: కమల్ హాసన్ థగ్ లైఫ్ జూన్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.36.52 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించకపోవడం మేకర్స్కు నిరాశ కలిగిస్తోంది.
అంతేకాకుండా ఇండియన్ 2 మరియు విక్రమ్ చిత్రాలతో పోలిస్తే అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇదే.ఇక ఈ మూవీ వారం రోజుల్లో దాని ఊపును కొనసాగించలేకపోతే, నిర్మాత కమల్ హాసన్‌కు భారీగా నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ కాకపోవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల షేర్, రూ.210 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకోవాల్సి ఉంది.
కలెక్షన్లు ఇలా
రిలీజ్ రోజు : రూ. 15.5 కోట్లు
2వ రోజు: రూ. 7.15 కోట్లు
3వ రోజు: రూ. 7.75 కోట్లు
4వ రోజు: రూ. 6.50 కోట్లు
మొత్తం: రూ. 36.90 కోట్లు