Kaala Bhairava and Kavya: పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ క్యూట్ కపుల్.... కాల భైరవ, కావ్య క్యూట్ పోస్ట్ వైరల్
కాల భైరవ, కావ్య క్యూట్ పోస్ట్ వైరల్
Kaala Bhairava and Kavya: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో కొత్త జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ, టాలెంట్ నటి కావ్య కల్యాణమ్ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రాగా.. ఎట్టకేలకు ఈ లవ్ బర్డ్స్ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని కన్ఫర్మ్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తనయుడిగా మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాల భైరవ. మరోవైపు బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. 'మసూద', 'బలగం' వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కావ్య కల్యాణమ్. ఈ ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా ఉండబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని మాటలను పంచుకున్నారు.
నీతో ఉంటే పారే సెలయేరును చూస్తున్నట్టుగా ఉంటుంది.. నిన్ను కలిసిన క్షణం నుంచే నా గమ్యాన్ని చేరుకున్నా" అంటూ కాల భైరవ ఎమోషనల్ అయ్యారు. ఇక తన జీవితంలోకి వెలుగులు నింపిన స్పెషల్ పర్సన్ ను కనుగొన్నానంటూ కావ్య కల్యాణమ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ క్యూట్ కపుల్‌కు.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.