‘Toxic’ : రాకింగ్ స్టార్ యష్ పేరు వింటే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తాయి. 'కేజీఎఫ్ 2' వంటి సరికొత్త చరిత్రాత్మక విజయం తర్వాత, యష్ నటిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'! గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

సినిమా విడుదల కావడానికి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే... బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇప్పటి నుంచే సునామీ మొదలైంది. 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణం నుంచే రికార్డుల మోత మోగిపోతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, భారత్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రెండు రోజుల్లోనే రూ. 30 కోట్ల గ్రాస్ మార్క్‌ను అవలీలగా క్రాస్ చేసేసింది

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 13 వేలకు పైగా షోలకు గాను... ఏకంగా 5 లక్షలకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా రాకింగ్ స్టార్ సొంత గడ్డ అయిన కర్ణాటకలో 'టాక్సిక్' మేనియా తారాస్థాయికి చేరింది. అక్కడ థియేటర్లన్నీ ఇప్పటికే 'ఫుల్ లేదా 'ఫాస్ట్ ఫిల్లింగ్' బోర్డులతో కళకళలాడుతున్నాయి. బెంగళూరు ఒక్కచోటే కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టిస్తోంది.

కేవలం కన్నడలోనే కాకుండా, హిందీ బెల్ట్‌లోనూ 'టాక్సిక్' సంచలనాలు సృష్టిస్తోంది. ఏ సర్టిఫికేట్ (A Certificate) వచ్చినప్పటికీ, హిందీ వెర్షన్‌లోనూ లక్షలాది టికెట్లు అమ్ముడై కన్నడ చిత్రానికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ మోత మోగుతోంది. నార్త్ అమెరికా (యూఎస్) ప్రీమియర్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే లక్షలాది డాలర్ల వసూళ్లను రాబట్టింది. విదేశాల్లో కన్నడ కంటే తెలుగు వెర్షన్‌కు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ప్రశంసలు కురుపిస్తున్నాయి.

రిలీజ్‌కు ముందే ఇలా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లతో ఊచకోత కోస్తోన్న 'టాక్సిక్'... బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

Tags: