Tripuraneni Chittibabu: టాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

Update: 2026-04-22 03:30 GMT

Tripuraneni Chittibabu: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు ఇక లేరు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.56 ఏళ్ల చిట్టిబాబు మంగళవారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

1970, జనవరి 1న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో జన్మించిన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. నిర్మాతగా, నటుడిగా, సినీ అనలిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ నటుడిగా పలు చిత్రాల్లో అలరించడమే కాకుండా.. సినీ సమస్యలపై తనదైన శైలిలో విశ్లేషణలు చేసేవారు."ఆయన అకాల మరణం టాలీవుడ్‌కు తీరని లోటు. చిట్టిబాబు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News