Trisha Krishnan: ప్రతీది ప్రేమ కాదు..త్రిష ఆసక్తికర పోస్ట్

త్రిష ఆసక్తికర పోస్ట్

Update: 2026-04-06 01:37 GMT

Trisha Krishnan: సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా తమిళ దళపతి, TVK అధినేత విజయ్‌తో త్రిష ప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లపై ఇప్పటివరకు నేరుగా స్పందించని త్రిష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన కోట్‌ను షేర్ చేసి అందరినీ ఆలోచనలో పడేశారు.

"త్రిష తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. అందులో ఉన్న మాటలకు 'నిజం' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ కోట్ సారాంశం ఏమిటంటే.. ‘ప్రతిదీ ప్రేమ కాదు.. కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు’. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ఇది విజయ్‌తో వస్తున్న వార్తలకు సమాధానమా? లేక సాధారణంగా షేర్ చేసిన కోటా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఒకవైపు వ్యక్తిగత జీవితంపై వార్తలు వస్తున్నా.. త్రిష మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సూర్యతో కలిసి ఆమె నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘వీరభద్రుడు’ విడుదలకు సిద్ధమైంది. మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరుతో ఆమె జతకడుతుండటంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి త్రిష షేర్ చేసిన ఈ 'లవ్' కోట్.. రూమర్లకు చెక్ పెడుతుందో లేక మరింత ఆజ్యం పోస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News