Trisha Krishnan: మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మూర్ఖత్వమే.. పార్థిబన్‌కు త్రిష చురకలు..
పార్థిబన్‌కు త్రిష చురకలు..
Trisha Krishnan: కోలీవుడ్ సీనియర్ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక అవార్డుల వేడుకలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మూర్ఖత్వానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
అసలేం జరిగింది?
ఇటీవల జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో పార్థిబన్ పాల్గొన్నారు. అక్కడ స్క్రీన్ పైన త్రిష ఫోటో కనిపించగానే ఆయన పరోక్షంగా స్పందిస్తూ.. "ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రాకుండా చూసుకోవాలి.. అదే మంచిది" అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల విజయ్‌తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకలో కనిపించిన నేపథ్యంలో పార్థిబన్ ఈ విధంగా అనడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.
త్రిష ఘాటు కౌంటర్:
ఈ విషయంపై త్రిష తన ఎక్స్ వేదికగా గట్టిగా బదులిచ్చారు. ఎవరి పేరు ఎత్తకుండానే ఆమె చురకలంటించార. "మైక్ చేతిలో ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటలు తెలివైనవిగానో, హాస్యంగానో ఉండవు. అవి మీ మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తాయి. అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకరమైన మాటలు.. ఎవరిని ఉద్దేశించి అన్నారో వారి కంటే, మాట్లాడిన వ్యక్తి వ్యక్తిత్వం గురించే ఎక్కువ చెబుతాయి. చివరి నిమిషంలో తన పేరును, ఫోటోను కావాలనే చేర్పించారని ఆర్గనైజర్లు తనకు చెప్పారని త్రిష ఈ సందర్భంగా వెల్లడించారు.
క్షమాపణ చెప్పిన పార్థిబన్:
వివాదం ముదరడం, నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు రావడంతో పార్థిబన్ వెనక్కి తగ్గారు. మార్చి 8న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా త్రిషకు క్షమాపణలు తెలుపుతూ పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొనడంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది.
అయినప్పటికీ, ఒక సీనియర్ నటుడు అయ్యి ఉండి తోటి నటి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.