Trisha Krishnan Visits Vijay’s Residence: ట్రెండింగ్ : చెన్నైలోని విజయ్ ఇంటికి త్రిష..

విజయ్ ఇంటికి త్రిష..

Update: 2026-05-04 10:52 GMT

Trisha Krishnan Visits Vijay’s Residence: తమిళ గడ్డపై దళపతి మార్క్ పాలిటిక్స్ పనిచేసింది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ పరిశీలిస్తే.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో ముందంజలో ఉంటూ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే కోటలను బద్దలుకొట్టి విజయ్ కింగ్ మేకర్ కాదు.. ఏకంగా కింగ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సినీ నటి త్రిష ఇవాళ తెల్లవారుజామునే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని విజయ్ విజయం కోసం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అనంతరం తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసానికి ఆమె చేరుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో వీరిద్దరి రిలేషన్ పై ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పినట్లు కనిపిస్తోంది.

మరోవైపు తన నివాసం వద్ద వేలాదిగా తరలివచ్చిన అభిమానులను చూసి విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఇంటి బాల్కనీలోకి వచ్చి విక్టరీ సింబల్ చూపిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. జై దళపతి.. జై టీవీకే అంటూ కార్యకర్తల నినాదాలతో చెన్నై రోడ్లు హోరెత్తుతున్నాయి. అటు బెంగాల్ లో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నా.. దక్షిణాదిలో మాత్రం విజయ్ సృష్టించిన ప్రభంజనమే ఇప్పుడు దేశవ్యాప్త హాట్ టాపిక్.

Tags:    

Similar News