Trivikram's DNA: DNA ట్విస్ట్‌తో త్రివిక్రమ్ విశ్వరూపం.. ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్ డీకోడింగ్ ఇదే!

డీకోడింగ్ ఇదే!

Update: 2026-06-30 07:33 GMT

Trivikram's DNA: అరవింద సమేత' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి సెట్ అయింది! గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

శివుని కుమారుడు, పార్వతీదేవికి గర్వకారణం, సనాతన దళపతి" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో ఎన్టీఆర్ ఈ పోస్టర్‌ను షేర్ చేశారు. మండుతున్న యుద్ధభూమి, పురాతన దేవాలయాల మధ్య శివుడి త్రిశూలం.. దాని మధ్యలో కుమారస్వామి శక్తి ఆయుధం హైలైట్‌గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! ఆ శక్తి ఆయుధం చుట్టూ మేఘాల రూపంలో 'DNA' ఆకారం ఉండటం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

పోస్టర్‌పై 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం'తో పాటు.. "ఒకే ఈటె, ఒకే లక్ష్యం.. ఒకే దైవ తీర్పు" అనే ఇంగ్లీష్ కొటేషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. మనిషి డీఎన్‌ఏకు, దైవశక్తికి మధ్య ఉన్న విశ్వసృష్టి రహస్యాలను చర్చిస్తూ.. ఒక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా త్రివిక్రమ్ దీన్ని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది!

ఈ సినిమాలో ఎన్టీఆర్ సాక్షాత్తూ కుమారస్వామిని పోలిన పాత్రలో కనిపించబోతున్నారట. ఈ భారీ విజువల్ వండర్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

Tags:    

Similar News