Ustaad Bhagat Singh: నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ జాతర.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు..

స్ట్రీమింగ్ తేదీ ఖరారు..

Update: 2026-04-11 11:02 GMT

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో పవన్ మార్క్ మేనరిజమ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది.

ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఉగాది కానుకగా వచ్చి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసి..

మార్చి 19న ఉగాది పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కలయికలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు తగ్గట్టే పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి అభిమానులను ఉర్రూతలూగించారు.

Tags:    

Similar News