‘Ustaad’ Third Song Promo Out: నెగ్గేదాకా తిక్కే ఉండాలే..ఉస్తాద్ మూడో సాంగ్ ప్రోమో

ఉస్తాద్ మూడో సాంగ్ ప్రోమో

Update: 2026-03-11 06:54 GMT

‘Ustaad’ Third Song Promo Out: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దేఖ్‌‌‌‌లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రోమోను విడుదల చేశారు.

‘ఎక్కే దిగే కిక్‌‌‌‌లోనా దక్కేదేముందే.. అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే.. ఎక్కి తొక్కిటేళ్లే ఉంటే తగ్గేదేముందే.. అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే.. రానీ చిక్కుల్ని.. నిన్ను నువ్వే చెక్కాలే.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉండాలే.. అరె ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా..’ అంటూ పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసేలా సాగిన ప్రోమో ఆకట్టుకుంది. ఫుల్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను గురువారం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ ఇన్‌‌‌‌స్పైరింగ్ లిరిక్స్ అందించగా, రామ్ మిరియాల పాడాడు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News