Pawan Kalyan: ఉస్తాద్ ..గబ్బర్ సింగ్ కు మించి ఉంటది

గబ్బర్ సింగ్ కు మించి ఉంటది

Update: 2026-03-12 07:22 GMT

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) ఒకటి. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాటలు, పోస్టర్లతో అంచనాలు పెంచేసిన దర్శకుడు తాజాగా ఓ కామెంట్ తో వాటిని రెట్టింపు చేశాడు. ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడిన హరీశ్ శంకర్.. పవన్ కెరీర్లోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుందని చెప్పాడు. గతంలో గబ్బర్ సింగ్ లో పవన్ ను చూపించిన తీరు ఒక ఎత్తయితే.. ఇందులో అంతకు మించి ఉంటుందని హింట్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags:    

Similar News