Vanitha: ఏంటీ నిజమా.. నాలుగో పెళ్లి చేసుకున్న వనిత ?
నాలుగో పెళ్లి చేసుకున్న వనిత ?;
Vanitha: Vanitha Vijay Kumarపలు రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ చిత్రం 'చంద్రలేఖ' తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, 'దేవి' వంటి చిత్రాల ద్వారా తెలుగు లోనూ మంచి గుర్తింపు పొందారు. అయితే వనిత సినీ కెరీర్ కన్నా ఆమె వ్యక్తిగత జీవితం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకు ఆమె మూడు వివాహాలు చేసుకొని, వాటన్నింటినీ విడాకు లతో ముగించుకున్నారు. ముందుగా ఆకాశ్ అనే వ్యక్తిని మొదటి వివాహం చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. తర్వాత ఆనంద్ అనే వ్యాపార వేత్తను వివాహ మాడింది.వీళ్లకు ఒక కూతురు ఉంది. ఈ బంధం ఎక్కువ కాలం నిలువలేదు. తర్వాత పీటర్ పాల్ అనే ఫొటో గ్రాఫర్ తో మూడో పెండ్లి చేసుకున్నారు. అది కాస్తా విఫలమై పోయింది. ఇక ఇప్పుడు తాజాగా రాబర్ట్ నాలుగో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ సమయంలో వనిత ఎమోషనల్ అవ్వడం, రాబర్ట్ ఆమె మెడలో తాళి కట్టిన సందర్భంగా కన్నీరు పెట్టుకోవడం ఆ వేడుకను హృద్యంగా మార్చాయి. ఇందుకు సంబంధిం చిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని తాజాగా బయటపెట్టారు. ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది.