Varun Tej and Lavanya: వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు పుట్టిన శిశువు… తాతగా మారిన నాగబాబు ఆనందం

తాతగా మారిన నాగబాబు ఆనందం

Update: 2025-09-10 10:25 GMT

Varun Tej and Lavanya: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు (2025 సెప్టెంబర్ 10) హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘నాగబాబు తాత అయ్యారు’ అంటూ జనసైనికులు, అభిమానులు విషెస్ అందిస్తున్నారు.

ఈ జంట 2025 మే 6న సోషల్ మీడియా ద్వారా తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నట్లు ప్రకటించారు. ‘మా జీవితంలో అత్యంత అందమైన పాత్రను పోషించబోతున్నాం.. కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇప్పుడు వరుణ్, లావణ్య తల్లిదండ్రులవ్వడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.

వీరిద్దరూ దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. తాము మొదటిసారి కలిసిన ప్రదేశమైన ఇటలీలో 2023 నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య కుటుంబంతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Tags:    

Similar News