Achyut Poddar: ప్రముఖ నటుడు, త్రీ ఇడియట్ ఫేమ్ అచ్యుత్ పోత్దార్ కన్నుమూత
అచ్యుత్ పోత్దార్ కన్నుమూత;
Achyut Poddar: ప్రముఖ మరాఠీ, హిందీ నటుడు అచ్యుత్ పోత్దార్ (91) కన్నుమూశారు. థానేలోని జూపిటర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆగస్టు 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది.ఆయన మరణం భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.ఆయన అంత్యక్రియలు ఆగస్టు ఇవాళ థానేలో జరగనున్నాయి.
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు ఆయన భారత సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశారు. అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ చిత్రంలో కహెనా క్యా చాహ్తే హో? అనే డైలాగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 2, పరిణీత, రంగీలా, దిల్ వాలే, లగేరహో, మున్నాభాయ్, వాస్తావ్ వెంటిలేటర్ వంటి చిత్రాల్లో నటించి బాగా గుర్తింపు పొందారు అచ్యుత్.
ఆయన తన 44వ ఏట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, 125కు పైగా హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు 95 టీవీ సీరియల్స్‌లో నటించారు. అర్ధ సత్య, యే దిల్ లగి, "వాగ్లే కీ దునియా" వంటివి ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు, సీరియల్స్ ఉన్నాయి.