Vijay & Rashmika: విజయ్, రష్మిక ఒకే కారులో.. ఫోటో నెట్టింట్లో వైరల్
ఫోటో నెట్టింట్లో వైరల్;
Vijay & Rashmika: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకే కారులో కనిపించారు. రష్మిక కారులోకి ఎక్కిన వెంటనే విజయ్ దేవరకొండ ముందు సీట్లో కనిపించిన దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఆ ఫోటో నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయింది. వీరిద్దరి బాండింగ్‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవు తున్నారు. "వాళ్లిద్దరూ కలిసే ఉండాలి" అనేలా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి జంటకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సా ధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రే క్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్ద రి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై పదే పదే స్పందిస్తూ తమ మధ్య ఉన్నది ఒక మంచి స్నేహం మాత్రమే అని స్పష్టం చేసిన, వారి కలయిక ఎప్పటికప్పు డు చర్చనీయాంశంగా మారుతోంది.