‘Slum Dog’: విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
షూటింగ్ పూర్తి
‘Slum Dog’: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా మొత్తం చిత్రీకరణ ముగిసింది.
పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై మేకర్స్ దృష్టి పెట్టనున్నారు. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తున్నారు. టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్‌ను చూస్తే కథలో చాలా పాత్రలకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది.
విజయ్ సేతుపతికి ఈ సినిమా చాలా ప్రత్యేకం. హీరోగా ఆయన నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. మరోవైపు పూరీ జగన్నాథ్‌కు కూడా ఈ సినిమా కీలకంగా మారింది. గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న పూరీ.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. విజయ్ సేతుపతితో చేసిన ఈ సినిమా తన కెరీర్‌కు మళ్లీ మంచి ఊపునిస్తుందని పూరీ అభిమానులు ఆశిస్తున్నారు.