‘Slumdog’ Teaser: భిక్షగాడిగా విజయ్ సేతుపతి.. ఊరమాస్ యాక్షన్‌తో ‘స్లమ్‌డాగ్’ టీజర్ అదరగొట్టిన పూరి జగన్నాథ్!
ఊరమాస్ యాక్షన్‌తో ‘స్లమ్‌డాగ్’ టీజర్ అదరగొట్టిన పూరి జగన్నాథ్!
‘Slumdog’ Teaser: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో మొదటిసారి తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్” . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా చిత్ర బృందం ఈ సినిమా పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేసింది. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, విజయ్ సేతుపతి ఊరమాస్ యాటిట్యూడ్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జీవితంలోని కఠినమైన నిజాలను ప్రతిబింబించే విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్‌తో టీజర్ చాలా ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. "కేవలం మనుగడ కోసం పోరాడేవారు, వర్షం పడినప్పుడు చెట్ల కింద ఆశ్రయం వెతుక్కునే నిర్భాగ్యుల" గురించి ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
అయితే ఆ తర్వాత వచ్చే విజువల్స్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేస్తాయి. సినిమాలో విజయ్ సేతుపతి కంటిచూపు లేని ఒక భిక్షగాడి (బ్లైండ్ బెగ్గర్) పాత్రలో కనిపిస్తారు. కానీ, ఆ నిస్సహాయ రూపం వెనుక ఒక డేంజరస్ ఫైటర్ దాగున్నాడని చూపిస్తూ.. ఆయన రౌడీలను ఊచకోత కోసే ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్స్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. బయటకు అమాయక భిక్షగాడిగా నటిస్తూనే.. తెరవెనుక ఆయన చేసే పోరాటం సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.
ఈ టీజర్‌లో మలయాళ బ్యూటీ సంయుక్త (మీనన్) మునుపెన్నడూ లేని విధంగా అత్యంత గ్లామరస్ పాత్రలో మెరిసిపోగా.. సీనియర్ నటి టబు ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించారు. టీజర్ మొత్తం పూరి జగన్నాథ్ మార్క్ యాటిట్యూడ్, హీరో క్యారెక్టరైజేషన్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. దీనికి తోడు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన ఎనర్జిటిక్ ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, జరీనా వహాబ్, వీటీవీ గణేష్ , బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్ మరియు జేబీ నారాయణ్ రావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్లమ్‌డాగ్ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌తో పూరి జగన్నాథ్ మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.