Vijay’s “VarisuJananaayagan” Audio Launch: మలేషియాలో విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్
విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్
Vijay’s “VarisuJananaayagan” Audio Launch: విజయ్ జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ డిసెంబర్27న జరగనుంది. ఆడియో లాంచ్ కౌలాలంపూర్‌లోని బుకిట్ జాలిల్ స్టేడియంలో జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇది విజయ్ చివరి సినిమాకు సంబంధించిన ఈవెంట్ కావడం వలన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
ఏకంగా 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల ఈ భారీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించడం ద్వారా, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతోంది. ఈ కార్యక్రమం విజయ్ సినిమాల ఆడియో ఫంక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు: హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.పూజా హెగ్డే , బాబీ డియోల్ (ప్రతినాయకుడి పాత్రలో),
ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్,మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 9, 2026 న సినిమా విడుదల కానుంది.