Vishwak Sen: ఫంకీ సినిమాపై ధీమాగా ఉన్నా: విశ్వక్ సేన్
విశ్వక్ సేన్
Vishwak Sen: విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' (Funky). ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో నేను చాలా నిరుత్సాహంలో ఉన్నాను. నా గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఫంకీ' సినిమాతో చాలా హ్యాపీగా, ధీమాగా ఉన్నాను. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అని ఈ సినిమా నాకు నేర్పింది." మన టైమ్ బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. కానీ టైమ్ బాగాలేనప్పుడు, మనం విజయాల్లో లేనప్పుడు కూడా మనల్ని నమ్మి మన వెంటే ఉండే వారే చాలా ముఖ్యం. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు."
"సాధారణంగా నా ప్రతి సినిమా విడుదలకు ముందు నాకు ఒక తెలియని టెన్షన్ ఉంటుంది. కానీ ఈ 'ఫంకీ' సినిమా విషయంలో మాత్రం నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్లలో రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారని నాకు తెలుసు. అనుదీప్ శైలిలో ఉండే వినోదం ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని, తనకు ఒక మంచి హిట్ అవసరమైన సమయంలో ఈ కథ దొరకడం తన అదృష్టమని పేర్కొన్నారు. తన స్పీచ్ చివరలో "జై ఎన్టీఆర్" అంటూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు.: వాలెంటైన్స్ వీకెండ్ కానుకగా ఫిబ్రవరి 13, 2026న (ఈరోజు) థియేటర్లలో విడుదలయ్యింది.