‘Spirit’ Movie: స్పిరిట్​లో డైనమిక్‌‌ పాత్రలో వివేక్ ఒబెరాయ్

డైనమిక్‌‌ పాత్రలో వివేక్ ఒబెరాయ్

Update: 2026-02-28 13:38 GMT

‘Spirit’ Movie: విభిన్న పాత్రలతో అలరించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతున్నాడు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్‌‌’లో ఆయన పవర్‌‌‌‌ఫుల్ పాత్ర పోషిస్తున్నట్టు రివీల్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ఫస్ట్‌‌లుక్‌‌లో వివేక్ ఒబెరాయ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌‌తో, ఇంటెన్స్ గా కనిపిస్తూ తన పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో డైనమిక్‌‌గా చూపించారు. అలాగే ఈ చిత్రంలో ఐశ్వర్య దేశాయ్‌‌ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలియజేశారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కాంచన కీలకపాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ -సిరీస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News