War 2: వార్ 2 బాక్సాఫీస్ తొలి రోజు కలెక్షన్లు..

తొలి రోజు కలెక్షన్లు..;

Update: 2025-08-15 14:03 GMT

War 2: ఒకే రోజు స్టార్ హీరోల చిత్రాలు వార్ 2, కూలీ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో వార్ 2 కంటే కూలీకి ఎక్కువ పాజిటివ్ టాక్ ఉంది. రేటింగ్స్ కూడా వార్ 2 కంటే కూలీకే కొన్ని సైట్స్ ఎక్కువ ఇచ్చాయి. కలెక్షన్లలో కూడా వార్ 2 కాస్త వెనుకబడిపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూలీ కంటే కలెక్షన్లు చాలా తక్కవ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూలీకి 140 కోట్ల గ్రాస్ వస్తే.. వార్ 2కి 85.90 కోట్ల గ్రాస్ వచ్చింది. కూలీకి మొత్తం నెట్ కలెక్షన్లు రరూ.65 కోట్లు కాగా..వార్ 2 కి రూ. 52 కోట్లు వచ్చాయి.

వార్ 2' సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సుమారు రూ.52.50 కోట్లు ( నెట్ కలెక్షన్లు) గా ఉన్నాయి. ఇందులో హిందీ వెర్షన్ రూ.29 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.23.25 కోట్లు, తమిళ వెర్షన్ రూ.25 లక్షలు వసూలు చేశాయి. గ్రాస్‌ కలెక్షన్స్‌ పరంగా చూస్తే వార్‌ 2 మొత్తంగా రూ. 85-.90 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఈ సినిమా రూ. 53 కోట్ల ఓపెనింగ్ వసూలు చేసిన 'వార్' (2019) రికార్డును చేరుకోలేకపోయింది. అయితే, దీనితో పాటు విడుదలైన రజనీకాంత్ 'కూలి' సినిమా రూ.65 కోట్ల వసూళ్లతో వార్ 2 కంటే ముందుంది .కూలీ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచింది. కానీ, విజయ్ "లియో" సినిమా మొదటి రోజు వసూలు చేసిన రూ.148 కోట్ల ప్రపంచవ్యాప్త రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది.

Tags:    

Similar News