War 2: వార్ 2 పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?
పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?;
War 2: ఇద్దరు స్టార్ హీరోలతో భారీ అంచనాలతో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన 'వార్ 2' సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఓవర్సీస్ తో పాటు చాలా చోట్ల సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాల్ షేర్ చేసుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ వంటి ఇద్దరు స్టార్ హీరోల యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
పాజిటివ్
సినిమాలో ఇద్దరు హీరోల నటన, స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధాన బలం అని ప్రేక్షకులు అంటున్నారు. వారి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఒకరికొకరు పోటీ పడుతూ నటించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని, ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ , క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయని చెబుతున్నారు. స్పై థ్రిల్లర్ అయినప్పటికీ, కథనంలో కొన్ని కొత్త అంశాలు ఉన్నాయని, గత స్పై యూనివర్స్ చిత్రాల కంటే భిన్నంగా ఉందని కొంతమంది ప్రేక్షకులు చెబుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం సినిమాకు కొత్త టచ్ ఇచ్చిందని, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్స్, డ్యాన్స్, కొన్ని ట్విస్టులు బాగా వర్కవుట్ అయ్యాయని ప్రశంసలు వస్తున్నాయి.
నెగటివ్
కథలోని భావోద్వేగాలను సరిగా చూపించలేకపోయారని, కథ చాలా నెమ్మదిగా సాగిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్పై యూనివర్స్ సినిమాలకు అలవాటుపడిన వారికి, ఈ సినిమా కథాంశం కొంత పాత ధోరణిలోనే ఉందని అనిపిస్తోంది. సినిమా మొదటి భాగం కొంత నిదానంగా సాగిందని, స్పీడ్ తక్కువగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా వార్ 2 ఒక యాక్షన్ థ్రిల్లర్ గా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, భావోద్వేగాలు, కథనంలో మరింత వేగం ఆశించిన ప్రేక్షకులను కొంత నిరాశపరిచిందని చెప్పవచ్చు. అయితే ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు ఇది ఒక ట్రీట్ అని, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.