War2 Movie: హృతిక్, ఎన్టీఆర్ ఎనర్జిటిక్ సాంగ్..ఫ్యాన్స్ కే పండగే

ఫ్యాన్స్ కే పండగే;

Update: 2025-08-08 11:43 GMT

War2 Movie: వార్ 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన దునియా సలామ్ అనాలి అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనిపై ఆసక్తిని పెంచేందుకు ఒక చిన్న టీజర్ మాత్రమే విడుదల చేశారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించారు. ఈ సాంగ్ లోహృతిక రోషన్, ఎన్టీఆర్ పోటీపడీ మరీ డ్యాన్స్ చేశారు . కొరియోగ్రఫీని బాస్కో లెస్లీ మార్టిస్ చేశారు.

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తోన్న వార్ 2యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఒక భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా. ఇందులో ప్రధాన పాత్రల్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ నటించారు. ఈ సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగం.

ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లకు, డ్యాన్స్ ఫేస్ -ఆఫ్‌లు చాలా అంచనాలు పెంచాయి .వార్ 2 సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. రజినీకాంత్ నటించిన కూలీతో పోటీ పడనుంది.

Tags:    

Similar News