Alia Bhatt: ఏంటీ అలియా మళ్ళీ ప్రెగ్నెంటా?
మళ్ళీ ప్రెగ్నెంటా?;
Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ రణ్ బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అదే ఏడాది ఆ జంటకు కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనుంది. ఇదిలా ఉండగా ఆమె మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నా యి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఆలియా వెళ్లినప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. జిమ్ కు వెళ్లినప్పుడు కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా ఆమె హడావిడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో ప్రెగ్నెంట్ రూమర్స్ వార్తలకు బలం చేకూరింది. కానీ హీరోయిన్ లేటెస్ట్ వీడియోతో అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి. ప్రస్తుతం ఆమె ఆల్ఫా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే క్రిస్ట్ మస్ పండగకు విడుదల కానున్న ఈ సినిమా డ్యాన్స్ రిహార్సల్ కి వెళ్లిన ఆలియా తాపీగా కారెక్కింది. అంతే కాదు. మధ్యలో అక్కడున్న వారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నన్సీ అంటూ వస్తున్న ప్రచారం నిజం కాదని తేలిపోయింది.