Bhartha Mahashayulaku Vignapti: భర్తమహాశయులకు విజ్ఞప్తి ట్వి్టర్ టాక్ ఏంటి.?

ట్వి్టర్ టాక్ ఏంటి.?

Update: 2026-01-13 06:33 GMT

Bhartha Mahashayulaku Vignapti: మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన "భర్త మహాశయులకు విజ్ఞప్తి" సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఓవర్సిస్ లో లలో ప్రీమియర్స్ చూసిన వాళ్లు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా, థియేటర్ల దగ్గర వినిపిస్తున్న పబ్లిక్ టాక్ ఏంటంటే.?

ఈ చిత్రం భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ఈ తరం వివాహ బంధాల్లో ఎదురయ్యే సవాళ్లను హాస్యభరితంగా చూపిస్తుంది. రవితేజ (రామ్ సత్యనారాయణ) తన భార్య (డింపుల్ హయతి), ప్రేయసి (ఆషికా రంగనాథ్) మధ్య చిక్కుకుని పడే ఇబ్బందులను ఫన్ రైడ్‌గా మలిచారు. రవితేజ తన మార్క్ ఎనర్జీతో, టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించడం అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. సునీల్, వెన్నెల కిషోర్, సత్య, రవితేజల మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ బ్లాక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని బ్యాలెన్స్ చేశారు. అయితే కథ కొంత రొటీన్‌గా అనిపించినా, కథనం (Screenplay) బోర్ కొట్టకుండా సాగింది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, ముఖ్యంగా 'బెల్లా బెల్లా' సాంగ్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్

రవితేజ కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ పిల్లర్

క్లీన్ ఎంటర్ టైనర్ ఫ్యామిలితో చూడదగిన సినిమా

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ

క్లైమాక్స్ బలహీనంగా ఉండడం

కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్

మొత్తానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక వన్‌ టైమ్ వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంక్రాంతి పండగ సీజన్‌లో సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.

Tags:    

Similar News