Public Talk on Kingdom: కింగ్డమ్ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?
ఎలా ఉందంటే.?;
Public Talk on Kingdom: విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ లో విజయ్ దేవర కొండ తన నటనతో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. సెకాండాఫ్ లో అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.
ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగుందని..సెకాండాఫ్ కొద్దిగా డల్ అయినా క్లైమాక్స్ బాగుందని సోషల్ మీడియాలో రివ్యూలు వస్తున్నాయి. విజయ్ ఖాతాలో హిట్ పడిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ పై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రొడక్షన్, టెక్నీకల్ వాల్యూస్ అద్భుతమని పోస్టులు పెడుతున్నారు.
సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై) ఈ సినిమా నిర్మించారు.భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్), సత్యదేవ్ విజయ్ దేవర కొండకు అన్నగా నటించారు. ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ వ్యవస్థలో జరిగే అన్యాయంపై ఎలా పోరాటం చేస్తాడు అనే కథాంశంతో రూపొందించబడింది.