Kishkindhapuri: కిష్కిందపురి పబ్లిక్ టాక్ ఎలాం ఉందంటే.?

పబ్లిక్ టాక్ ఎలాం ఉందంటే.?

Update: 2025-09-12 06:42 GMT

Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కిందపురి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన కొందరు బాగుందని..మరికొందరు పర్వాలేదని చెబుతున్నారు.

పాజిటివ్:

సినిమాలో కొన్ని హారర్ , థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా భయపెట్టాయని, ముఖ్యంగా ఆసుపత్రిలోని సన్నివేశం బాగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని, హారర్ వాతావరణాన్ని సృష్టించడంలో ఇవి బాగా ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ తమ పాత్రలలో బాగా నటించారని, అనుపమ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా, వేగంగా ఉందని ప్రేక్షకులను కథలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు.

నెగటివ్

సినిమా కథనం కొన్ని చోట్ల ఊహించగలిగే విధంగా ఉందని, సస్పెన్స్ పెద్దగా లేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ టచ్ ఆశించిన స్థాయిలో లేదని, క్లైమాక్స్ ఇంకా మెరుగ్గా ఉండవచ్చని చెబుతున్నారు. సినిమాలోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదని, సినిమా కథకు ఇవి మైనస్ పాయింట్‌గా నిలిచాయని అంటున్నారు. 'కిష్కిందపురి' ఒక హారర్ థ్రిల్లర్‌గా కొంతవరకు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, బలమైన కథనం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోవడం దీనికి ఒక మైనస్ పాయింట్‌గా మారింది. అయినప్పటికీ, హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగిన సినిమా అని కొందరు చెబుతున్నారు.ఈ సినిమా తేజ సజ్జా 'మిరాయ్' సినిమాతో ఒకే రోజున విడుదల కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News