Malaika’s Bold Comments: నచ్చిన వ్యక్తితో శృంగారం చేస్తే తప్పేంటి.? మలైకా బోల్డ్ కామెంట్స్

మలైకా బోల్డ్ కామెంట్స్

Update: 2025-11-07 04:56 GMT

Malaika’s Bold Comments: నటి మలైకా అరోరా తన కంటే వయసులో చిన్నవాడైన నటుడు అర్జున్ కపూర్తో చాలా కాలం డేటింగ్ చేసింది. అర్జున్ కపూర్ మలైకా కంటే దాదాపు 12 సంవత్సరాలు చిన్నవాడు.అయితే, ఇటీవల మలైకా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు , ఒక మ్యూజిక్ ఈవెంట్ లో ఆమె ఒక 'మిస్టరీ మ్యాన్' తో కనిపించిన వీడియో కారణంగా, ఆమె 30 ఏళ్ల యువకుడితో డేటింగ్ చేస్తోందనే పుకార్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి. కచేరీలో కనిపించిన ఆ వ్యక్తి 33 ఏళ్ల హర్ష్ మెహతా అనే వజ్రాల వ్యాపారి అని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ డేటింగ్ వార్తల గురించి మలైకా గానీ, ఆ వ్యక్తి గానీ ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు.

అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో "నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి" అనే విధంగా బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక మగాడు తన కంటే చిన్న వయసున్న స్త్రీని డేటింగ్ చేస్తే, సమాజం దాన్ని గొప్పగా అంగీకరిస్తుంది ("డ్యూడ్" అంటారు). కానీ ఒక స్త్రీ తన కంటే చిన్న వయసున్న పురుషుడిని డేటింగ్ చేస్తే, ఆమెను 'కౌగర్' (Cougar) లేదా 'అవకాశవాది' లేదా 'తల్లి-కొడుకు' లాంటి సంబంధం అంటూ విమర్శిస్తారు. స్త్రీ పురుషుడి కంటే చిన్నగా ఉండడం పవిత్రమైనదిగా, పెద్దగా ఉండడం పాపంగా చూస్తారు.విడాకులు లేదా బ్రేకప్ తర్వాత కూడా స్త్రీలకు ఒక జీవితం ఉండడం, ఆ జీవితాన్ని వాళ్ళు తమ ఇష్టం ప్రకారం జీవించడం చాలా ముఖ్యం అని అన్నారు. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం తనను ఒక మెరుగైన వ్యక్తిగా మార్చిందని, కాబట్టి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నానని ఆమె తెలిపారు.

Tags:    

Similar News