Newly Married Couple Call on Amit Shah: అమిత్ షాను కలిసిన కొత్త జంట.. ఎందుకో తెలుసా..?
ఎందుకో తెలుసా..?
Newly Married Couple Call on Amit Shah: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒకటియ్యారు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ రాజసాన్ని ప్రతిబింబించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ, రెండు భిన్న సంప్రదాయాల్లో ఈ పెళ్లిని నిర్వహించారు. నిన్న ఉదయం 10 గంటల శుభముహూర్తానికి విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి తన అర్ధాంగిగా చేసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
పెళ్లి ముగిసిన కొద్దిసేపటికే ఈ కొత్త జంట తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. "కొత్త ప్రయాణం మొదలైంది" అంటూ వారు పెట్టిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. సమంత, అల్లు అర్జున్ వంటి సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అమిత్ షాతో భేటీ: రిసెప్షన్ కు ఆహ్వానం
పెళ్లి జరిగిన వెంటనే ఈ జంట నేరుగా ఢిల్లీకి ప్రయాణమై వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిసిన విజయ్-రష్మిక దంపతులు, ఆయనకు గణపతి విగ్రహాన్ని బహూకరించి తమ పెళ్లి రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి రాజస్థాన్‌లో జరిగినప్పటికీ, టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ వేడుకను ప్లాన్ చేశారు. మార్చి 4న తాజ్ కృష్ణలో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ఉద్ధండులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.