Actress Mrunal Thakur: సెట్స్‌లో మృణాల్ మూడీగా ఎందుకు ఉంటుందో తెలుసా?

ఎందుకు ఉంటుందో తెలుసా?

Update: 2026-04-10 02:58 GMT

Actress Mrunal Thakur: బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లోనే ఎక్కువ సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న నటి మృణాల్ ఠాకూర్. 'సీతారామం', 'హాయ్ నాన్న', 'కల్కి 2898 AD' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆమె.. ఈ రోజు విడుదలైన 'డెకాయిట్' (Dacoit) చిత్రంలో సరస్వతి అనే పాత్రతో అలరించేందుకు సిద్ధమైంది. అయితే, షూటింగ్ సెట్స్‌లో ఆమె ప్రవర్తన గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

సెట్స్‌లో మృణాల్ అప్పుడప్పుడు చాలా మూడీగా కనిపిస్తుందని ఆమె సహనటుడు అడివి శేష్ వెల్లడించారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. "ఆమె కొన్నిసార్లు కోపంగా ఉంటుంది, కొన్ని రోజులు చాలా సరదాగా గడుపుతుంది, మరికొన్ని రోజులు రోజంతా ఏదో బాధలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే మొదట్లో మాకు ఇది అర్థం కాలేదు కానీ, తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆమె తన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. షూటింగ్‌కు రాకముందే స్క్రిప్ట్ చదివి, తన డైలాగులు గుర్తుంచుకుని ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకే సెట్‌కు వచ్చాక కూడా అదే జోన్‌లో ఉండిపోవడం వల్ల అందరికీ ఆమె మూడీగా ఉన్నట్లు అనిపిస్తుంది" అని వివరించారు.

తన పాత్ర కోసం మృణాల్ పడుతున్న ఈ కష్టాన్ని చూస్తుంటే, 'డెకాయిట్' సినిమాతో ఆమె ఖాతాలో మరో భారీ హిట్ చేరడం ఖాయమనిపిస్తోంది.

Tags:    

Similar News