'Cocktail 2': కాక్ టెయిల్ 2 కి 'A' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? సెన్సార్‌పై షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్

షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Update: 2026-06-20 07:49 GMT

'Cocktail 2': బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్లుగా నటించిన క్రేజీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'కాక్ టెయిల్ 2' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే, ఈ సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌పై హీరో షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన షాహిద్ కపూర్.. ఈ చిత్రానికి 'ఎ' (A - Adults Only) సర్టిఫికెట్ ఇవ్వడంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాక్ టెయిల్ 2 పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన లేదా అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. సినిమా మొత్తంలో ఒక్క సీన్ కూడా అలా అనిపించదు. మరి అలాంటి క్లీన్ చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా దానికి సమాధానం దొరకడం లేదు. ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే అందమైన కథ. కుటుంబసభ్యులందరూ కలిసి హాయిగా థియేటర్లో ఎంజాయ్ చేసే చిత్రం. ప్రేక్షకులు ఈ సినిమా చూసి థియేటర్ల నుంచి నవ్వుతూ బయటకు వస్తారు' అంటూ షాహిద్ కపూర్ ధీమా వ్యక్తం చేశారు."

మరోవైపు ఈ సినిమా కథపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ కృతి సనన్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'లెస్బియన్ లవ్ స్టోరీ' అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఖండించారు. ఇది ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా అని కృతి సనన్ క్లారిటీ ఇచ్చారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. టాక్‌తో సంబంధం లేకుండా 'కాక్ టెయిల్ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్స్ మరిన్ని పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News