Will Smith Join Allu Arjun’s ‘Raaka’: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రాకా. ఈ సినిమా కాస్టింగ్, క్యారెక్టర్లకు సంబంధించి ఫిలింనగర్ వర్గాల్లో సరికొత్త సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని, ఇందుకోసం చిత్ర యూనిట్ గత కొంతకాలంగా ఆయనతో చర్చలు జరుపుతోందని సమాచారం. త్వరలోనే ఆయన భాగమయ్యే సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా ఈ భారీ చిత్రంలో భాగం కానున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ అల్లు అర్జున్, విల్ స్మిత్, షారుక్ ఖాన్ ముగ్గురూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ప్రపంచ సినిమా స్థాయిలోనే రాకా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ భారీ కాస్టింగ్‌పై నిర్మాతల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రంలో బన్నీ సరసన దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, కథానుగుణంగా మొత్తం నలుగురు హీరోయిన్లకు చోటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విజువల్ వండర్‌ను పలు అంతర్జాతీయ, భారతీయ భాషల్లో అత్యంత గ్రాండ్‌గా 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags: