Women Wear Red Scarves to Pawan’s Movie: ముఖానికి ఎర్రటి స్కార్ఫ్ ధరించి పవన్ మూవీకి మహిళలు.. ఎందుకంటే..?
ఎందుకంటే..?;
Women Wear Red Scarves to Pawan’s Movie: పవన్ కళ్యాణ్ సినిమా 'హరి హర వీర మల్లు' నిన్నవిడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, మొదటి రోజే మంచి వసూళ్లు రాబట్టింది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ను తెరపై చూడడంతో అభిమానులు ఉత్సాహంగా థియేటర్లకు పోటెత్తారు. కొంతమంది అభిమానులు పార్టీ జెండాను పట్టుకుని, మరికొంతమంది భుజాలపై ఎర్ర తువ్వాలు వేసుకుని రకరకాలుగా థియేటర్లకి వెళ్లారు.
కానీ కొంతమంది మహిళలు ముఖాలపై బురఖాలు ధరించి వచ్చి పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర్ వీర మల్లు' చిత్రాన్ని మొదటి రోజు చూశారు. ఆ స్త్రీలు ముఖాలకు ఎర్రటి స్కార్ఫ్ ధరించి సినిమాకి వచ్చారు. అది ధరించి మొత్తం సినిమా చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. మహిళలు ఇలా ఎందుకు చేశారనే చర్చకు దారితీసింది.
నిరసనగా మహిళలు ఇలా చేశారని కొందరు ఊహించారు. కానీ అలా కాదు. ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి, చిత్ర బృందం స్వయంగా 'హరి హర వీర మల్లు' సినిమా చూడటానికి ఇలాంటి పరదాలతో వచ్చారు. మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ 'పరద' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొంతమంది మహిళలు ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి 'హరి హర వీర మల్లు' సినిమా చూడటానికి స్కార్ఫ్ ధరించారు.
కొన్నేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ప్రముఖ చిత్రం 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, అనుపమ పరమేశ్వరన్ నటించిన 'పరద' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ స్త్రీ స్వేచ్ఛకు సంబంధించినది. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. పరద' చిత్ర బృందం 'హరి హర వీర మల్లు' చిత్రం ద్వారా తమ చిత్రాన్ని విభిన్నంగా ప్రమోట్ చేసింది.