Yash’s “Toxic” Release Postponed: యష్ ‘టాక్సిక్’ విడుదల మళ్ళీ వాయిదా.. జూన్ 4న రావడం లేదు!

జూన్ 4న రావడం లేదు!

Update: 2026-04-29 11:49 GMT

Yash’s “Toxic” Release Postponed: కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదలకు సంబంధించి సినీ ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, ఈ చిత్రం జూన్ 4వ తేదీన విడుదల కావడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వాయిదా పడటం ఇది రెండోసారి.

నిజానికి ‘టాక్సిక్’ చిత్రం తొలుత మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అప్పట్లో పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ రిలీజ్ డేట్‌ను జూన్ 4కు మార్చారు. ఇప్పుడు తాజాగా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల (Partnerships) కోసం సినిమాను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా యష్ మరియు చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. "సినిమా నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మరియు స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్స్‌ను క్రమబద్ధీకరించే పనిలో ఉన్నాం. అందుకే మా విడుదల షెడ్యూల్‌ను పునఃసమీక్షించాం. ముందుగా అనుకున్న జూన్ 4న సినిమా రావడం లేదు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసేందుకు కొత్త తేదీని ప్రకటిస్తాం," అని పేర్కొన్నారు. సినిమాను అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో ప్రపంచ ప్రేక్షకులకు అందించాలన్నదే తమ ఉద్దేశమని యష్ తెలిపారు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం పోర్చుగీస్ పాలనలోని గోవా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో యష్ ‘రాయ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత మరియు తారా సుతారియా వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వంటి భారీ విజయం తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News