Yash’s ‘Toxic’ Teaser: యష్ టాక్సిక్ టీజర్..అరాచకం అంతే..
అరాచకం అంతే..
Yash’s ‘Toxic’ Teaser: యష్ (Yash) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో యష్ 'రాయా' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో అత్యంత వైలెంట్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు... పట్టుదల వదిలేయ్ అని అవతలి వారు అంటే, దానికి యష్ "నేను అయ్యే వరకు ఇది అవ్వదు అని చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్ చివరలో యష్ క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం (Dual Role) చేసే అవకాశం ఉందనే ఊహాగానాలకు దారితీసింది.గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ఉన్నాయి.
ఈ సినిమా కథ 1940 - 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ అని సమాచారం.
యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ , తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజు రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది.