Young beauty Mamita Baiju: ఆ సీన్స్ కోసం రాత్రంతా ప్రాక్టీస్ చేశా.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Young beauty Mamita Baiju: యంగ్ బ్యూటీ మమిత బైజు, తాను నటించిన తాజా చిత్రం డ్యూడ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు తనకు ఒక సవాలుగా అనిపించాయని ఆమె తెలిపారు. "డ్యూడ్ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం నేను రాత్రంతా కూర్చొని డైలాగ్‌లు ప్రాక్టీస్ చేశాను. ఆ పని సవాలుగా అనిపించినా, చాలా ఉత్సాహంగా ఉండేది" అని మమిత బైజు వెల్లడించారు.
పాత్ర గురించి మమిత బైజు
ఈ సినిమాలో తాను కురల్ అనే పాత్ర పోషించినట్లు చెప్పింది. ఈ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యం ఉందని.. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదని మమిత అన్నారు. దర్శకుడు కీర్తీశ్వరన్ సినిమాను చాలా అద్భుతంగా తీశారని ఆమె కొనియాడారు. హీరో ప్రదీప్ రంగనాథన్ సెట్స్‌లో చాలా హెల్ప్ చేసేవారని.. శరత్ కుమార్ లాంటి సీనియర్ నటుడితో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకు పెద్ద బలం అని, నిర్మాతలు చాలా ప్యాషనేట్‌గా సినిమాను గ్రాండ్‌గా నిర్మించారని మమిత బైజు నమ్మకం వ్యక్తం చేశారు.
తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.