Ramayana Yatra: ఈ నెల 25 నుంచి 17 రోజులు రామాయణ యాత్ర

రామాయణ యాత్ర;

Update: 2025-07-05 17:45 GMT

Ramayana Yatra:  శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 17 రోజుల టూర్ ప్యాకజీకి ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25 నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. జులై 25న దిల్లీలోని సర్దార్గాం జ్ రైల్వేస్టేషన్ నుంచి ఈ ప్రయాణం మొదల వుతుంది. అక్కడినుంచి నేరుగా యూపీలోని అయోధ్య రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి యాత్ర పారంభమవుతుంది. అయో ధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నాటినుంచి 'శ్రీ రామాయణ యాత్ర' పేరుతో యాత్రికుల కోసం టూర్ ప్యాకేజీని తెచ్చింది.

ఈ యాత్ర 5వ ఎడిషన్ ను ఈ నెల 25న ప్రారంభం కానుంది. 16 రాత్రులు, 17 రోజుల ఈ టూర్ అయోధ్య నుంచి మొదలై సీతామర్హి, వారణాసి, ప్రయా గ్జ్, నాసిక్ మీదుగా రామేశ్వరం సందర్శ నతో ముగుస్తుంది. మొత్తం 150 మంది ప్రయా ణికులకు భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్లో యాత్రకు అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కోటిక్కెట్ ధర రూ.1,15,180గా ఉంది. ప్రస్తుతం టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది.

Tags:    

Similar News