Chandra Grahan: నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?
ఎప్పుడు చూడొచ్చంటే?
Chandra Grahan: ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.
చంద్రగ్రహణం వల్ల ఈరోజు దేశంలోని ఆలయాలు మూతపడినా కొన్ని మాత్రం తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి ఈ జాబితా ఉండగా, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా ఈరోజు తెరిచే ఉంటాయి. ఇక ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బిహార్), లక్ష్మీనాథ్ టెంపుల్, కల్పేశ్వర్ ఆలయాలు ఈరోజు తెరిచే ఉంటాయి.
గ్రహణ సమయంలో సూర్యచంద్రుల ప్రతికూల కిరణాలు ఆలయాల్లోని విగ్రహాల శక్తిని ప్రభావితం చేస్తాయని శాస్త్ర వచనం. విగ్రహాల్లోని ప్రాణశక్తికి ఆటంకం కలగకుండా, గర్భాలయంలోని పవిత్రతను కాపాడటానికి గుళ్లు మూసివేస్తారు. గ్రహణ విడుపు తర్వాత ఆలయాలు శుద్ధి చేసి, సంప్రోక్షణ నిర్వహించి తిరిగి తెరుస్తారు. గ్రహణ సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని, విగ్రహాల్లోని దైవిక తరంగాలు దెబ్బతినొద్దని ఈ నియమాన్ని పాటిస్తారు.