Akshaya Tritiya: అక్షయ తృతీయ.. పొరపాటున కూడా ఈ వస్తువులు కొనకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం పోయి దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం..

లక్ష్మీదేవి అనుగ్రహం పోయి దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం..

Update: 2026-04-06 11:39 GMT

Akshaya Tritiya: సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తృతీయ నాడూ వచ్చే ఈ పండుగను ఈ ఏడాది ఏప్రిల్ 19న జరుపుకోనున్నాము. ఈ రోజున చేసే ఏ శుభకార్యానికైనా ముహూర్తం చూడాల్సిన అవసరం లేనంత పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనడం అదృష్టంగా భావిస్తారు. అయితే తెలియక చేసే కొన్ని పొరపాట్లు, కొన్ని వస్తువుల కొనుగోలు వల్ల ఇంట్లోని ప్రశాంతత దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అక్షయ తృతీయ నాడు అస్సలు కొనకూడని వస్తువులు ఇవే..

పదునైన - మొనదేలిన ఆయుధాలు:

ఈ పవిత్రమైన రోజున కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లేదా సూదులు వంటి పదునైన వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడి, ఇంట్లోని శాంతికి భంగం కలుగుతుందని నమ్ముతారు.

నలుపు రంగు వస్తువులు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు శని మరియు రాహు గ్రహాలకు ప్రతీక. అక్షయ తృతీయ వంటి శుభ దినాన నల్లని దుస్తులు, బూట్లు లేదా నలుపు రంగు ఫర్నిచర్ కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లు అవుతుంది.

అల్యూమినియం - స్టీల్ పాత్రలు:

సాధారణంగా ఈ రోజున లోహ వస్తువులు కొనడం మంచిదే కానీ, లోహం ఎంపికలో జాగ్రత్త వహించాలి. అల్యూమినియం, స్టీల్ పాత్రలు రాహువు ప్రభావం కలిగి ఉంటాయని అంటారు. వీటిని కొనడం వల్ల సంపద వృద్ధి చెందకపోగా, ఉన్న శ్రేయస్సు తగ్గుతుంది. వీటికి బదులుగా రాగి, ఇత్తడి లేదా వెండి వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ముళ్ల మొక్కలు

వాస్తు శాస్త్రం ప్రకారం, అక్షయ తృతీయ నాడు ముళ్ల మొక్కలను ఇంటికి తీసుకురాకూడదు. ఇవి జీవితంలో ఆటంకాలను సృష్టించి, ఆర్థిక పురోగతికి అడ్డుపడతాయని నమ్ముతారు.

ఏం చేస్తే మంచిది?

అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని పూజించి, పేదలకు దానధర్మాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకుంటూ, మంగళకరమైన వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోవడం వల్ల సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

Tags:    

Similar News