అమర్ నాథ్ యాత్ర..6రోజుల్లో లక్ష మంది

6రోజుల్లో లక్ష మంది;

Update: 2025-07-09 08:29 GMT

Amarnath Yatra: ఈ నెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు జమ్మూ&కశ్మీర్ లెఫ్లినెంట్ గవర్న్ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈ సారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.

ఇటీవల జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల అలజడి నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూకాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా జమ్మూకాశ్మీర్ సర్కారు చర్యలు తీసుకుంది. అమర్ నాథ్ యాత్ర మార్గంలో నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించింది. జులై 1 నుంచి ఆగష్టు 10 వరకు ఈ ఆదేశాలు కొనసాగనున్నట్లు తెలిపింది. జమ్ము నుంచి బాల్తాల్​, పహల్గాంలోని బేస్ క్యాంపులకు యాత్రికుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్​లోతోపాటు ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News