Native Place: మీ ఊరి నుండి ఈ వస్తువులను ఎప్పుడూ తీసుకురావద్దు
ఈ వస్తువులను ఎప్పుడూ తీసుకురావద్దు;
Native Place: ప్రతి స్త్రీకి ఇల్లు స్వర్గం లాంటిది. ఒక స్త్రీ మనస్సులో తన ఊరి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అయితే కొన్ని సంప్రదాయాల ప్రకారం.. ఒకరి స్వస్థలం నుండి కొన్ని వస్తువులను తీసుకురావడం అశుభమని నమ్ముతారు.
అందులో మొదటిది.. ఇంటి నుండి ఇనుప వస్తువులను తీసుకురావడం అశుభం అని అంటారు. దీనికి కారణం స్పష్టంగా చెప్పనప్పటికీ, గతంలో ఇనుప పెట్టెలు ఇవ్వడం సర్వసాధారణం. ఇప్పుడు దీనిని అశుభంగా పరిగణిస్తున్నారు. రెండవది పాత లేదా ఉపయోగించిన వస్తువులను తీసుకురావడం కూడా అశుభమని నమ్ముతారు. వీటిలో ప్రతికూల శక్తులు ఉండవచ్చని, కొత్త ఇంట్లో సమస్యలను కలిగిస్తాయని ఒక నమ్మకం ఉంది.
ఇంటి నుంచి చింతపండు కూడా తీసుకురావద్దని అంటారు. ఇది కలహాలు, గందరగోళానికి దారితీస్తుంది. పత్తిని తీసుకురావడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది. ఇది చెడు వార్తలను తెస్తుందని నమ్ముతారు. చివరగా, పాలు, పెరుగు, నెయ్యి, చీపుర్లు వంటి ఆహార పదార్థాలను ఇంటి నుండి దూరంగా ఉంచాలని చెప్పబడింది. వీటి వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. మీరు ఊరగాయలు తీసుకురావాలనుకుంటే, మీ ఊరికి అదే విలువ గల డబ్బు ఇవ్వడం మంచిదని పురాణాల్లో చెప్పబడింది.