Key Alert TTD: నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలి ..TTD కీలక ప్రకటన!

TTD కీలక ప్రకటన!

Update: 2026-02-26 08:50 GMT

Key Alert TTD: తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. కేరళకు చెందిన భక్తుడు శ్రీ సి.కె. సురేష్ బాబు తిరుమలలో “కర్ణాటక ప్రవాసి సౌధ” పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి చేత మోసపోయిన ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో, టీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది.

విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించారు. గూగుల్ సెర్చ్‌లలో ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తూ, భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తేలింది.

ఈ నేపథ్యంలో, నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే, టీటీడీ చిహ్నాలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది.

దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

భక్తులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఫోన్ కాల్స్‌ను వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని కోరడమైనది.

Tags:    

Similar News