Budha Mahadasha Begins May 13: మే 13 నుండి ఈ రాశుల వారికి బుధ మహర్దశ.. ఇక తిరుగుండదు..

ఇక తిరుగుండదు..

Update: 2026-05-05 14:41 GMT

Budha Mahadasha Begins May 13: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ప్రతి రాశిపై ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా తెలివితేటలు, వ్యాపారం, వాక్చాతుర్యానికి అధిపతి అయిన బుధ గ్రహం మే 13వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకోబోతోంది. ఈ క్రమంలో బుధుడు సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్య-బుధుల ప్రభావంతో ఏర్పడే ఈ మార్పు వల్ల ప్రధానంగా ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన పురోగతి, ఆర్థిక లాభాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సంచారం ఒక వరం లాంటిది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పాత అప్పులు తీర్చివేస్తారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి

బుధుడు మిథున రాశికి అధిపతి కావడంతో ఈ నక్షత్ర మార్పు వీరికి ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీ కెరీర్‌కు ప్లస్ అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

సింహ రాశి

వృత్తిపరంగా సింహ రాశి వారికి ఇది అత్యంత కీలక సమయం. మీరు ఆశిస్తున్న పెద్ద బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. భవిష్యత్తుకు పునాది వేసే పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా, విదేశీ ప్రయాణాలకు కూడా మార్గం సుగమం కావచ్చు.

కన్యా రాశి

కన్యారాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో పై అధికారుల అండదండలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ సమయం మానసిక ప్రశాంతతను, వృత్తిపరమైన గౌరవాన్ని ఇస్తుంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. గృహంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయి శాంతి నెలకొంటుంది.

Tags:    

Similar News