Devotional: చెట్లు తొలగించి ఇండ్లు కట్టుకోవచ్చా.?

ఇండ్లు కట్టుకోవచ్చా.?;

Update: 2025-06-04 09:48 GMT

Devotional: ఈ రోజుల్లో చెట్లు నరికేసి ఇండ్లు కట్టుకోవడం కామన్ అయిపోయింది. రియట్ ఎస్టేట్ పెరగడంతో కాస్తంత స్థలాన్ని కూడా వదిలేయడం లేదు. గుట్టలు,కుంటలు,పొదలు ఇలా అన్నింటిని తొలగించి నేలను చదును చేసి ఇళ్లు,భారీ భవనాలు కడుతుంటారు. అయితే ఇలా చెట్లను తొలగించి ఇళ్లు కట్టుకుంటే మంచిది కాదని పురానాలు చెబుతున్నాయి. చెట్లు, పొదలు ఉన్న ప్రదేశాల్లో సాధారణంగా సర్పాలు నాగులు ఉంటాయి కాబట్టి సామూహిక సర్పవధ జరగటం వలన ఆ ప్రదేశానికి, యజమానికి, పని వారికి అందరికి సర్పశాపం తగులుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ దేవతా సర్పములను చంపివేసిన చోట, రియల్ ఎస్టేల్ వ్యాపారులు అపార్టుమెంట్లు, భవనాలు, ఇళ్ళు నిర్మించి ఇతరులకు విక్రయిస్తారు. ఇక అలాంటి వాటిలో నివసిస్తున్న వారికి కూడా సర్పశాప ప్రభావం ఖచ్చితంగా ఉంటుందట. జన్మకుండలిలో సర్పశాపం ఉన్నవారు.. ఇలాంటి ప్రదేశాలలో నివసిస్తే ఇక వాటి ప్రభావాలు వర్ణనాతీతం. అతి భయంకరమైన సర్పశాప ప్రభావాలు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రదేశాలలో జీవించేవారు దీర్ఘ రోగాలకు గురికావటం, సంతానం చెడుదోవలు పట్టటం, సంతానంప్రమాదాల్లో మరణించడం, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవటం లాంటి అనర్థాలను ఎదుర్కోక తప్పదని పురాణాలు చెబుతున్నాయి. భార్యా,భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయని చెబుతున్నారు. అయితే ఇలా ఇళ్లు కట్టుకున్న విముక్తి పొందడానికి కొన్ని దోష నివారణ చర్యలు చేపడితే దోషం తొలిగిపోతుందని చెబుతున్నారు. 

Tags:    

Similar News