May Block Goddess Lakshmi’s Blessings: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే లక్ష్మీదేవి అస్సలు రాదు.. వెంటనే తీసేయండి!

వెంటనే తీసేయండి!

Update: 2026-05-30 12:24 GMT

May Block Goddess Lakshmi’s Blessings: ఇల్లు పచ్చదనంతో, కలకలలాడుతూ ఉండాలని చాలామంది రకరకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు మనకు ప్రశాంతతను, ఆక్సిజన్‌ను ఇస్తాయనేది ఎంత నిజమో.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక నష్టాలు, కుటుంబంలో గొడవలు వస్తాయనేది కూడా అంతే నిజం. తెలియక చేసే చిన్న తప్పుల వల్ల.. ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలను అస్సలు పెంచకూడదో.. వాటి వల్ల వచ్చే ఆర్థిక సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో అస్సలు పెంచకూడని మొక్కలలో మొదటివి.. ముళ్ళు ఉన్న మొక్కలు. కలబంద (Aloe Vera) మినహాయించి.. క్యాక్టస్ (జెముడు) లాంటి ముళ్ళ మొక్కలను ఇళ్లలో లేదా బాల్కనీల్లో అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని నశింపజేసి.. ప్రతికూల వాతావరణాన్ని తెస్తాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.

అలాగే, పాలు కారే మొక్కలు. కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలు తుంచితే తెల్లటి పాలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇలాంటి మొక్కలను ఇంట్లో ఉంచితే.. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది.

ఇక చాలామంది ఇళ్లల్లో చూసే మరో పెద్ద తప్పు.. ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలను అలాగే ఉంచడం. కుండీల్లో మొక్కలు ఎండిపోతే వాటిని వెంటనే తొలగించాలి. ఎండిన మొక్కలు రాహు-కేతువుల ప్రభావానికి, దరిద్రానికి సంకేతం. ఇవి ఇంట్లో ఉంటే ఎంత సంపాదించినా రూపాయి కూడా చేతిలో నిలవదు.

దీంతో పాటు, ఇళ్లల్లో బోన్సాయ్ (Bonsai) మొక్కలను పెంచడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. కానీ పెద్ద వృక్షాన్ని ఎదగకుండా చిన్న కుండీలో బంధించే ఈ బోన్సాయ్ మొక్కలు.. ఇంట్లో ఉండే వారి కెరీర్ గ్రోత్‌ను, ఆర్థిక ఎదుగుదలను కూడా అలాగే ఆపేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News